telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రియల్ హీరో పాత్ర కావాలంటున్న స్టార్ హీరోయిన్

Samantha

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత‌ ప్ర‌స్తుతం 96 రీమేక్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు 96 రీమేక్ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 7న విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంతో పాటు “ది ఫ్యామిలీ మ్యాన్” సీజ‌న్ 2 వెబ్ సిరీస్ చేస్తుంది. 2019లో బేబీ, మ‌జిలీ చిత్రాల‌తో స‌మంత భారీ విజ‌యాలను ద‌క్కించుకుంది. తాజాగా ఈ అమ్మడికి బాలీవుడ్ నుంచి ఆఫర్ రాగా, దానిని సున్నితంగా తిర‌స్క‌రించింద‌ట‌. అయితే తాజాగా త‌న‌కు ఓ రియ‌ల్ హీరో బ‌యోపిక్‌లో న‌టించాల‌నుంద‌ని చెప్పింది స్టార్‌ హీరోయిన్ స‌మంత అక్కినేని. రీసెంట్‌గా ఓ అవార్డు ఫంక్ష‌న్‌లో స‌మంత పాల్గొన్నారు. తాను జీవితంలో సాధించింది చాలా త‌క్కువ‌ని, త‌న‌ను మించిన వారెంద‌రో ఉన్నార‌ని స‌మంత ఈ సంద‌ర్భంగా తెలిపారు. ఎవ‌రైనా ఓ రియ‌ల్ హీరో బ‌యోపిక్‌లో న‌టించాల‌నుంద‌ని ఈ సంద‌ర్భంగా స‌మంత అన్నారు. త‌న మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట పెట్టిన స‌మంత కోసం అలాంటి స్క్రిప్ట్‌ను ఏ ద‌ర్శ‌కుడు తీసుకొస్తాడో చూడాలి.

Related posts