telugu navyamedia
సినిమా వార్తలు

ఓ బేబీ వీడియో వైరల్ : సమంతతో గంగవ్వ ఇంటర్వ్యూ…

Samantha

దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో “ఓ బేబీ” అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. “ఎంత సక్కగున్నావే” అనేది ట్యాగ్ లైన్. “మిస్ గ్రానీ” అనే కొరియన్ సినిమాను నందిని రెడ్డి రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో సమంత సరికొత్త లుక్ లో కనిపించనుంది. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సురేశ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. సీనియర్ హీరోయిన్ లక్ష్మి ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించారు. ఊర్వశి, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్, నాగశౌర్య ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్లకు మంచి స్పందన లభించింది. ఈ సినిమా జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో సమంత, డైరెక్టర్ నందినీరెడ్డి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ విపరీతంగా ఆకట్టుకుంటోంది. రొటీన్‌కు భిన్నంగా ఆ ఇంటర్వ్యూ సాగడమే అందుకు కారణం. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన ‘మల్లేశం’ చిత్రంతో మరింత గుర్తింపు తెచ్చుకున్న గంగవ్వ తొలిసారి సినిమా ఇంటర్వ్యూ చేయడం.. ఆమె అడిగిన ప్రశ్నలకు నిర్మొహమాటంగా సమంత సమాధానాలు చెప్పడంతో యూట్యూబ్‌లో ఈ ఇంటర్వ్యూ సంచలనంగా మారింది. గంగవ్వ అడిగిన ప్రశ్నలు.. సమంత చెప్పిన సమాధానాలు…

గంగవ్వ: సినిమాల్లో వేరే వాళ్లు తాళి కడతారు.. మీ భర్త ఏమీ అనరా?
సమంత: మీరు మంచి ప్రశ్న అడిగారు. కానీ, సినిమాల్లో ఏం జరుగుతుందంటే అక్కడ రెండే ముళ్లు వేస్తారు. మూడో ముడి వేయరు.

గంగవ్వ: మరి మాకు మూడు ముళ్లు వేసినట్టు కనిపిస్తుంది..?
నందినీరెడ్డి: ఒకటే ముడిని మూడుసార్లు చూపిస్తారు.
సమంత: ఇప్పుడు అర్థమైందా?.. క్లియర్ అయిపోయిందా… కానీ ఇలాంటి ప్రశ్న ఏ ఇంటర్వ్యూలోనూ అడగలేదు. మీరు మంచి ప్రశ్న అడిగారు.

గంగవ్వ: (నందినీరెడ్డితో) మీరు ప్యాంటు, షర్ట్ వేసుకుంటారు.. మీ సార్ ఏమీ అనరా?
నందినీరెడ్డి: ఇలా ఆగమాగం అవుతుందని చెప్పే నేను చాలా తెలివిగా సార్‌ను పెట్టుకోలేదు

గంగవ్వ: (సమంతతో) మీ అత్తగారిని మీరు మంచిగా చూసుకుంటారా? లేక మీ అత్తగారే మిమ్మల్ని మంచిగా చూసుకుంటారా?
సమంత: ఇద్దరం ఒకర్నొకరు మంచిగా చూసుకుంటాం.

గంగవ్వ: ఇంట్లో వంట మీరు చేస్తారా? మీ సార్ చేస్తారా? లేక హోటల్ నుంచి తెచ్చుకుంటారా?
సమంత: మీరేం కోరుకుంటున్నారు?

గంగవ్వ: మీరే చెయ్యాలి, మీ సార్ తినాలి
సమంత: ఇప్పటిదాకా అలా లేదు. ఇక నుంచి అలాగే చేస్తా
గంగవ్వ: మీ భర్తను మీరు ఎంత పెట్టి(కట్నం) కొనుకున్నారు?
సమంత: కట్నమా.. చాలా ఇచ్చా. (అది బయటకు చెప్పకూడదు కదా అంటూ గంగవ్వ చెవిలో చెబుతుంది)

గంగవ్వ: అన్ని పైసలిచ్చి కొన్నారా?
సమంత: మరి.. అంత పెద్ద ఫ్యామిలీ కదా?
నందినీరెడ్డి: నేను ఎందుకు చేసుకోలేదు అనుకుంటున్నావ్.. నాకు అన్ని పైసలు లేవు మరి.!
…ఇలా సాగిన ఆ ఇంటర్వ్యూ. మీరు కూడా వీరి ఇంటర్వ్యూ ను వీక్షించండి.

Related posts