telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరోసారి హోస్ట్ గా సమంత

sam

ఇప్పటికే వెబ్ సిరీస్‌లు చేసేందుకు ఓకే చెప్పిన సామ్.. హోస్టుగా కూడా సత్తా చాటాలని కుతూహలంగా ఉంది. అయితే ఆమె కోసం అల్లు అరవింద్ పక్కా ప్లాన్ చేశారని టాక్. ఇటీవలే బుల్లితెర పాపులర్ షో బిగ్ బాస్ తెరపై సందడి చేసి అందరిచేత భేష్ అనిపించుకుంది సమంత. మామ నాగార్జున స్థానాన్ని భర్తీ చేస్తూ బిగ్ బాస్ దసరా స్పెషల్ ఎపిసోడ్ బాధత్యలు భుజాన వేసుకుంది. ఈ ఎపిసోడ్‌లో హోస్ట్‌గా సమంత వ్యవహరించిన తీరు విమర్శకుల ప్రశంసలందుకోవడమే గాక భారీ టీఆర్ఫీ సంపాదించి ఆమె సత్తా ఏంటో తెలియజేసింది. దీంతో ఇదే జోష్‌లో త్వరలో ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ ఫామ్‌పై ఓ టాక్ షో చేయడానికి రెడీ అయిందట సమంత. ఈ రియాలిటీ షోని సమంత ఒప్పుకోవడానికి కారణం బడా నిర్మాత, ఆహా వ్యవస్థాపకులు అల్లు అరవింద్ అని సమాచారం. ఆమె చేయబోయే ఈ షో కోసం భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నారట అల్లు అరవింద్. ప్రస్తుతం ఈ షోకి సంబంధించిన షూటింగ్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం సమంతకు భారీగా రెమ్మ్యూనరేషన్ ఆఫర్ చేశారనేది ఫిలిం నగర్ టాక్. అతిత్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలపనున్నారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు గెస్టులుగా తీసుకొచ్చి, సరదా సరదా ముచ్చట్లతో ఎంతో ఆహ్లాదకరంగా సాగిపోతూ అందరినీ ఆకట్టుకునేలా ఈ షోని పక్కాగా ప్లాన్ చేశారట.

Related posts