telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

బుల్లితెర పై .. సందడి చేయనున్న… నటి సమంత…

Samantha

నటి సమంత అక్కినేని బుల్లితెర షోలతో కూడా బిజీ కానుందట. ఇంటింటికి సామ్ తరహాలో ఓ బుల్లితెర టాక్ షోని తనకోసం డిజైన్ చేశారని అందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. ఇది ఏ చానెల్ లో ఉంటుంది.. ఎన్ని ఎపిసోడ్లు.. అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ టాక్ షో ద్వారా సెలబ్రిటీ ఇంటర్వ్యూలు చేస్తుందా.. లేక ఇంకేదైనా ఇన్నోవేటివ్ గా ఉంటుందా.. అన్నది చూడాలి.

అక్కినేని కోడలుగా తనకు ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఏదైనా సామాజిక అంశంతో ముడిపడిన కార్యక్రమం చేస్తుందనే భావిస్తున్నారు. ప్రత్యూష సామాజిక సంస్థ ద్వారా సేవలందిస్తున్న సమంత ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తుందేమో చాడాలి మరి.

Related posts