telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బేబీ బంప్ తో అనుష్క బికినీ… సమంత కామెంట్

Samantha

విరుష్క అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే జంట విరాట్ కోహ్లీ, అనుష్కలలది. వీరు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. బేబీ బంప్‌తో బికినీలో ఉన్న తన ఫొటోను అనుష్క సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “బేబీ బంప్‌తో, బ్లాక్ స్విమ్ సూట్‌లో అనుష్క ‘దేవత’లా ఉంది” అంటూ సమంత కామెంట్ చేసింది. త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న అనుష్కకు సెలబ్రిటీలే కాదు ఎంతో మంది సామాన్యులు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ‘జీరో’ సినిమా తర్వాత మరో సినిమాలో కనిపించలేదు అనుష్క. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఇండియన్ ఉమెన్ క్రికెటర్ ఝులన్ గోస్వామి బయోపిక్‌గా రానున్న ‘చక్దాహా ఎక్స్‌ప్రెస్’ సినిమాలో నటించేందుకు రెడీ అయింది. కానీ ఈ మూవీ షూటింగ్ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. కోహ్లీ ప్రస్తుతం యూఏఈలో ఐపీఎల్ ఆడుతున్నాడు. గర్భవతి అయిన అనుష్క హాయిగా రిలాక్స్ అవుతోంది.

Related posts