telugu navyamedia
సినిమా వార్తలు

బ్లాక్ కలర్ బికినీలో సమంత… “ఐ లవ్యూ 3000”

Samantha-and-Nagachaitanya

టాలీవుడ్ సెలెబ్రిటీ దంపతులు నాగచైతన్య, సమంత ప్రస్తుతం స్పెయిన్ లో హాలీడే ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల “మజిలీ” సినిమాతో సక్సెస్ అందుకున్నారు సమంత, చైతన్య. ప్రస్తుతం వీరిద్దరూ స్పెయిన్ లోని బార్సిలోనాలో ఉన్నారు. అక్కడి ప్రముఖ చెఫ్ డానీ గార్సియాకు చెందిన రెస్టారెంట్ ముందు జంటగా తీసుకున్న ఫోటోని చైతు ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇక సమంత తన స్టేటస్ లో ఓ ఫోటో పోస్ట్ చేసింది. అందులో నాగ చైతన్య, సమంత పొట్టి బట్టల్లో పడక కుర్చీల్లో సేదతీరుతున్నారు. ఈ ఫొటోలో సమంత బ్లాక్ కలర్ బికినీ వేసుకొని ఉండగా… ఈ ఫోటోపై “ఐలవ్యూ 3000” అని క్యాప్షన్ ఉంది. “అవెంజర్స్” సినిమాలో “ఐ లవ్యూ 3000” అనే డైలాగ్ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు సమంత కూడా ఆ డైలాగ్ ను వాడేసింది. ఇలా ఈ ఫోటోకి విపరీతమైన స్పందన వస్తోంది. కొందరు మాత్రం ఇకనైనా ఇలాంటి బట్టలు వేసుకోవడం మానేయాలని సమంతకి సూచిస్తున్నారు.

Related posts