telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

నయనతార పై సమంత సంచలన వ్యాఖ్యలు…

నేడు లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార 36వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ రోజుతో నయన్‌ 37వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీ, అభిమానుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో నయనతార ప్రియుడు దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ ప్రేయసికి ప్రత్యేక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ కథానాయిక సమంత కూడా నయన్‌కు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపింది. ఒకే ఒక నయనతారకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు. నువ్వు మరింతగా వెలగాలి. మనదైన దాని కోసం పోరాడే స్ఫూర్తిని మాలాంటి వాళ్లకి కలిగించాలి. నీకు మరింత బలం చేకూరాలి. సిస్టర్.. నీ బలానికి, పట్టుదలకు సెల్యూట్ అంటూ అక్కినేని సమంత కామెంట్ చేసింది. నయన్‌ ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తమిళ చిత్రం ‘నెట్రికన్‌’ (మూడో కన్ను) సినిమాలోని టీజర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఈ సినిమాలో నయన్‌ అంధురాలిగా సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. టీజర్‌లో..అంధురాలిగా తనకు ఎదురుపడే సవాళ్లను ఛాలెంజ్‌గా ఎదుర్కొని ఎలా పరిష్కరిస్తుందనేది కనిపిస్తోంది. ఇందులో నయన్‌ అద్భుతంగా నటించడంతో.. టీజర్‌ అభిమానుల్లో హైప్‌ క్రియేట్‌ చేస్తోంది. చూడాలి మరి సినిమా ఎలా ఉంటుంది అనేది.

Related posts