telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అల వైకుంఠపురంలో… అరుదైన రికార్డు సొంతం చేసుకున్న “సామజవరగమన”

AY

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సినిమాగా రూపుదిద్దుకుంటున్న చిత్రం “అల వైకుంఠపురములో”. 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ చిత్రాన్ని హారిక మరియు హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లలో ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అక్కినేని సుశాంత్, నివేత పేతురాజ్, సీనియర్ నటి టబు, నవదీప్, మురళి శర్మ, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అల్లు అరవింద్‌, ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుందని సమాచారం. తమన్‌ స్వరకర్త. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ “సామజవరగమన” సాంగ్ విడుదలై రికార్డులు సృష్టిస్తోంది. యువ సింగర్ సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ సాంగ్ ప్రస్తుతం యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 40 మిలియ‌న్ వ్యూస్‌ను సంపాదించుకుంది. అలాగే పాట‌కు 7 ల‌క్ష‌ల లైక్స్ వ‌చ్చాయి. తెలుగు పాట‌ల్లో అధిక లైక్స్ సంపాదించుకున్న సాంగ్‌గా ఇది రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సంద‌ర్భంగా బ‌న్నీ అభిమానుల‌కు, ప్రేక్ష‌కులకు ట్విట్ట‌ర్ ద్వారా థ్యాంక్స్ చెప్పారు.

Related posts