telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అల వైకుంఠపురములో : “సామజవరగమన” సాంగ్ కు 30 మిలియన్ వ్యూస్

AY

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సినిమాగా రూపుదిద్దుకుంటున్న చిత్రం “అల వైకుంఠపురములో”. 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ చిత్రాన్ని హారిక మరియు హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లలో ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అక్కినేని సుశాంత్, నివేత పేతురాజ్, సీనియర్ నటి టబు, నవదీప్, మురళి శర్మ, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అల్లు అరవింద్‌, ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుందని సమాచారం. తమన్‌ స్వరకర్త. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ “సామజవరగమన” సాంగ్ విడుదలై రికార్డులు సృష్టిస్తోంది. యువ సింగర్ సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ సాంగ్ ప్రస్తుతం యువతను విశేషంగా ఆకట్టుకుంటూ నేటితో ఏకంగా 30 మిలియన్లకు పైగా వ్యూస్ ని దక్కించుకుని ముందుకు సాగుతోంది.

Related posts