పాకిస్తాన్ దాడులను తిప్పి కొట్టే క్రమంలో విక్రమ్ అభినందన్ అనే భారత పైలట్ ఆ దేశ సైన్యానికి పాకిస్తాన్ ఆర్మీకికి పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను హింసించినట్లుగా ఉన్న వీడియోలు బహిర్గతం కావడంతో యావత్ భారతావని ఆందోళనలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో అభినందన్ వర్థమాన్ ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఒకవైపు దేశంలో స్వార్థ రాజకీయాలు, టీఆర్పీ రేటింగ్స్‌లో మీడియా సంస్థలు పోటీ పడుతుంటే.. గాయాలపాలై పాక్ కు చిక్కిన ఇండియన్ పైలట్ అభినందన్ ధైర్యం కోల్పోకుండా నిబ్బరంగా ఉంటూ.. దేశ రహస్యాలు వెల్లడించేందుకు నిరాకరించారు. విపత్కర పరిస్థితుల్లోనూ గొప్ప ధైర్యసాహసాలను ప్రదర్శించిన అభినందన్‌కు నా సెల్యూట్’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. అభినందన్ నా హీరో.. అతన్ని స్వదేశం తీసుకురండి అంటూ ట్యాగ్ చేశారు
బీజేపీకి పెరుగుతున్న ఆధరణను చూసి టీఆర్‌ఎస్ భయపడుతుంది: లక్ష్మణ్