telugu navyamedia
రాజకీయ వార్తలు

రాహుల్ మళ్లీ పార్టీ బాధ్యతలను స్వీకరించాలి: సల్మాన్ ఖుర్షీద్

salman kurshid

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై ఆ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలు పెను దుమరాన్నే రేపాయి. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం రాహుల్ బాధ్యతలకు దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించు కున్నారంటూ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలతో సొంత పార్టీ నేతల నుంచే ఆయనకు తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో, ఖుర్షీద్ యూటర్న్ తీసుకున్నారు. రాహుల్ గాంధీ మళ్లీ పార్టీ బాధ్యతలను స్వీకరించాలని తాను కోరుకుంటున్నాని అన్నారు. నిజాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తించాలని… పార్టీని మళ్లీ గాడిలో పెట్టే దిశగా అడుగులు వేయాలని చెప్పారు. తనను విమర్శిస్తున్నవారంతా మనసు లేని యంత్రాలు అంటూ మండిపడ్డారు.

సోషల్ మీడియా ద్వారా ఖుర్షీద్ స్పందిస్తూ, ‘నా వ్యాఖ్యలు పార్టీని దెబ్బతీసేలా ఉన్నాయని కొందరు కాంగ్రెస్ నేతలు అన్నారు. నా వ్యాఖ్యలు ఎందుకు బాధ కలిగించాయో అందరూ తెలుసుకోవాలి. విమర్శలు మానుకొని ధైర్యాన్ని ప్రదర్శించాలి. లేకపోతే పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుంది’ అని అన్నారు. రాహుల్ పార్టీ పగ్గాలను మళ్లీ స్వీకరించాలని… పార్టీ శ్రేణులకు ఉత్తేజపరిచే కార్యక్రమాన్ని సోనియాగాంధీ కొనసాగించాలని అన్నారు.

Related posts