telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

షారుఖ్ కు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సల్మాన్… వీడియో వైరల్

Sharukh

కింగ్ ఖాన్ షారూఖ్ 54వ బ‌ర్త్‌డే శ‌నివారం ఘ‌నంగా జ‌రిగింది. కుటుంబ స‌భ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు షారూఖ్‌కి ప్ర‌త్యేక జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ సందర్భంగా బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ స‌రికొత్త రికార్డ్ సృష్టించారు. షారూఖ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న పేరుని ప్రపంచంలోని ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించారు. ‘కింగ్ ఆఫ్ బాలీవుడ్ షారూఖ్ ఖాన్ హ్యాపీ బ‌ర్త్‌డే’ అనే సందేశం బుర్జ్ ఖ‌లీఫాపై ప్ర‌త్య‌క్షం కాగా, ఇది చూసిన ప్ర‌తి ఒక్క అభిమాని ఎంత‌గానో పుల‌క‌రించిపోయారు. బుర్జ్ ఖ‌లీఫాపై ఓ నటుడి పేరు ప్ర‌ద‌ర్శించ‌డం ఇదే తొలిసారి కాగా, ఈ విష‌యం విన్న షారూఖ్ కూడా తెగ సంతోషించాడు. త‌న ట్విట్ట‌ర్‌లో వీడియోని షేర్ చేస్తూ.. త‌న బ‌ర్త్‌డేకి ఇలాంటి గిఫ్ట్ ఇచ్చిన నిర్వాహ‌కులకి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. కాగా బ‌ర్త్‌డే ముందు రోజు రాత్రి షారూఖ్ ఇంటి ద‌గ్గ‌ర అభిమానులు ఆయ‌న‌కి బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలిపేందుకు భారీ ఎత్తున త‌ర‌లివ‌చ్చారు.

ఇక బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్ త‌న దబాంగ్ టీంతో క‌లిసి హ్యాపీ బ‌ర్త్‌డే పాట పాడారు. ఇండ‌స్ట్రీ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్‌కి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు అని వీడియోలో పేర్కొన్నారు. ఆ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీనికి స్పందించిన షారూఖ్‌ఖాన్ “థ్యాంక్యూ భాయ్.. ఈ రోజు నిన్ను నేను చాలా మిస్ అయ్యాను. మా అమ్మ‌మ్మ‌గారి ఊరు హైద‌రాబాద్‌లో ఉన్న నువ్వు అక్క‌డ అంద‌రు సంతోషంగా ఉండేలా చేస్తున్నావు. నువ్వు త్వ‌ర‌గా ఇక్క‌డికి రా.. నీ నుండి బ‌ర్త్‌డే హ‌గ్ పొందాల‌ని ఉంది” అని షారూఖ్ పేర్కొన్నారు. స‌ల్మాన్ ద‌బాంగ్ 3 చిత్ర ప్ర‌మోష‌న్ కోసం హైద‌రాబాద్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

 

View this post on Instagram

 

Happy bday khan Saab. . Hamare industry ka king khan @iamsrk

A post shared by Chulbul Pandey (@beingsalmankhan) on

Related posts