telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“దబాంగ్-3″ని బ్యాన్ చేయండి… హిందు జాగృతి స‌మితి డిమాండ్

Dabang

ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో స‌ల్మాన్ హీరోగా తెర‌కెక్కిన “ద‌బాంగ్ 3”. ఈ చిత్రంలో చుల్‌బుల్ పాండేగా అల‌రించ‌నున్నాడు స‌ల్మాన్‌. డిసెంబ‌ర్ 20న తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ భాష‌ల‌లో ఈ చిత్రంలో కిచ్చా సుదీప్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర పోషిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ద‌బాంగ్ సిరీస్‌లో వ‌చ్చిన రెండు చిత్రాలు మంచి విజ‌యం సాధించ‌డంతో ద‌బాంగ్ 3పై కూడా బోలెడ‌న్ని ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. ఇటీవ‌ల చిత్రానికి సంబంధించి హుద్ హుద్ సాంగ్ విడుద‌ల చేశారు మేక‌ర్స్. ఇందులో సల్మాన్ సాధువుల‌తో క‌లిసి న‌ర్మ‌దా న‌ది ద‌గ్గ‌ర డ్యాన్స్ చేస్తాడు. ఈ సీన్ హిందువుల మ‌నోభావాల‌ని దెబ్బ‌తీసేలా ఉంద‌ని కొంద‌రు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా హిందు జాగృతి స‌మితి ద‌బాంగ్ 3 చిత్రాన్ని బాయ్‌కాట్ చేయాల‌ని డిమాండ్ చేస్తూ, సెన్సార్ బోర్డ్ వారు స‌ర్టిఫికెట్ ఇవ్వొద్ద‌ని కోరింది. అయితే #BoycottDabangg3 అనే హ్యాష్ ట్యాగ్‌ని సోష‌ల్ మీడియాలో ట్రెండ్ చేస్తుంటే ఆయ‌న అభిమానులు #AwaitingDabangg3 ని ట్రెండ్ చేస్తున్నారు. మొత్తానికి నెటిజ‌న్స్ రెండు గ్రూపులుగా విడిపోయి సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తున్నారు. సోనాక్షి సిన్హా చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

Related posts