telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దబంగ్-3 : షాకింగ్… సల్మాన్ వీరాభిమాని… ఫస్ట్ డే, ఫస్ట్ షో కోసం…!

Dabang

ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో స‌ల్మాన్ హీరోగా తెర‌కెక్కిన చిత్రం “ద‌బాంగ్ 3”. ఈ చిత్రంలో చుల్‌బుల్ పాండేగా అల‌రించ‌నున్నాడు స‌ల్మాన్‌. డిసెంబ‌ర్ 20న తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ భాష‌ల‌లో ఈ చిత్రంలో కిచ్చా సుదీప్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర పోషిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ద‌బాంగ్ సిరీస్‌లో వ‌చ్చిన రెండు చిత్రాలు మంచి విజ‌యం సాధించ‌డంతో ద‌బాంగ్ 3పై కూడా బోలెడ‌న్ని ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. ‘దబంగ్-3’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సినిమా కోసం సల్మాన్ అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ముంబైకి చెందిన సల్మాన్ వీరాభిమాని ఒకరు అక్కడి గైటీ గ్యాలెక్సీలో “దబంగ్-3” ఫస్ట్ డే, ఫస్ట్ షోకు సంబంధించిన 150 టిక్కెట్లను బుక్ చేసుకున్నాడు. “దబంగ్-3” ఏకంగా 5 వేల స్క్రీన్‌లపై విడుదల కానుంది. ఈ సినిమాను హిందీతో పాటు, తమిళ, తెలుగు, కన్నడ బాషలలోనూ విడుదల చేయనున్నారు. సినిమా విడుదలకు 5 రోజుల ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ సినిమాకు రూ.30 కోట్ల వరకూ ఓపెనింగ్స్ రావచ్చని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Related posts