telugu navyamedia
సినిమా వార్తలు

సల్మాన్ ప్రేయసికి తప్పిన ప్రమాదం

Salman-Khan-Girlfriend

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ కొద్ది రోజుల క్రితం రొమానియ‌న్ బ్యూటీ ఉలియా వంతూర్‌తో కలిసి తిరగడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ పెళ్ళి చేసుకుంటారనే వార్తలు కూడా బాలీవుడ్ లో విన్పించాయి. అయితే ఉలియా ఇటీవల వార్త‌ల‌లో కన్పించడం లేదు. తాజాగా ఆమె పెద్ద ప్ర‌మాదం నుండి త‌ప్పించుకున్న‌ట్టు ఓ వీడియో ద్వారా తెలిపింది. షూటింగ్ నిమిత్తం ఇండొనేసియా వెళ్లిన ఉలియా బాలిలోని ఓ హోటల్‌లో దిగింది. అదే సమయంలో అక్క‌డ 5.7 తీవ్రతతో భూమి కంపించింది. కానీ అదృష్టవశాత్తు ఎవ్వరికీ ఏమీ కాలేదు. ఈ విష‌యాన్ని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో వివ‌రించింది. “జీవితానికి మేలుకొలుపు. ఉద‌యం భ‌యంక‌ర‌మైన అలారంతో నిద్ర లేచాను. నేను్న‌న ప్ర‌దేశంలో భూమి 5.7 తీవ్ర‌త‌తో కంపించింది. కొద్ది క్ష‌ణాల పాటు నా మైండ్‌లో వేల ఆలోచ‌న‌లు తిరిగాయి. దేవుడిని న‌మ్ముకొని కామ్‌గా ఉన్నాను. ఎలాంటి చెడు జ‌ర‌గ‌ద‌ని నా మ‌న‌సుకి అనిపిస్తూనే ఉంది. అనుకున్న‌ట్టుగానే ఎవ‌రికి ఏం జ‌ర‌గ‌లేదు. కొద్ది క్ష‌ణాల‌లో అంతా నార్మ‌ల్‌గా ఉంది. ఇక ఆ త‌ర్వాత షూటింగ్‌కి ఏమి కాన‌ట్టే వెళ్ళాను. నేను ఇంకా బ‌తికే ఉన్నాన‌ని మ‌న‌సులో అనుకుంటూ ఉన్నాను. ఏదేమైన మ‌ళ్ళీ నేను పుట్టినట్టుగా ఉంది. అందుకే బాలీ ప్ర‌దేశంలో ఫోటో షూట్ చేశాను. ఈ ప్ర‌దేశం చాలా అందంగా ఉంది” అని ఉలియా పేర్కొంది. ఉలియా నటించిన “రాధా క్యూ గోరీ మై క్యూ కాలా” చిత్రం త్వరలో విడుదల కానుంది.

Related posts