telugu navyamedia
సినిమా వార్తలు

ఇప్పుడు సల్మాన్ రీల్ లైఫ్ తండ్రి ఇతడే

Salman-Khan

ప్రభుదేవా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్లు సల్మాన్‌ఖాన్, సోనాక్షిసిన్హా హీరోహీరోయిన్లుగా “దబాంగ్-3” చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం చిత్రీకరణ చాలా రోజుల క్రితమే మొదలైంది. కానీ “భారత్” సినిమా షెడ్యూల్‌తో సల్మాన్ బిజీ అవ్వడంతో “దబాంగ్-3” షూటింగ్‌కు బ్రేక్ పడింది. తాజాగా “దబాంగ్-3” చిత్రం మళ్లీ సెట్స్ పైకి వెళ్ళింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు సల్మాన్. దబాంగ్, దబాంగ్-2 చిత్రాల్లో చుల్‌బుల్ పాండే (సల్మాన్) తండ్రి ప్రజాపతి పాత్రలో బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా నటించారు. అయితే వినోద్‌ఖన్నా 2017లో చనిపోయారు. దీంతో “దబాంగ్-3″లో సల్మాన్ తండ్రి పాత్ర కోసం వినోద్‌ఖన్నా సోదరుడు ప్రమోద్ ఖన్నాను ఎంపిక చేసుకున్నారు. తన రీల్‌లైఫ్ ఫాదర్ ప్రమోద్ ఖన్నాను పరిచయం చేస్తున్న వీడియోను పోస్ట్ చేస్తూ “ఇంట్రడ్యూసింగ్ ప్రమోద్ ఖన్నా…” అని ట్వీట్ చేశాడు సల్మాన్. దబాంగ్-3కి సంబంధించిన అప్డేట్ రావడంతో సల్మాన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related posts