telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బిగ్ బాస్”కు స్వస్తి పలకనున్న సల్మాన్ ?

Salman-Khan

ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో సూపర్‌హిట్ అయిన టీవీ రియాలిటీ షో “బిగ్‌బాస్”. అత్యధిక ప్రేక్షకాదరణ దక్కించుకుంటున్న ఈ రియాలిటీ షో హిందీ వెర్షన్‌కు సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ షో నాలుగో సీజన్ నుంచి ప్రస్తుత 13వ సీజన్ వరకు అంటే దాదాపు పది సీజన్లకు సల్మానే హోస్ట్. ప్రతి సీజన్‌కు తన పారితోషికాన్ని పెంచేస్తున్నా.. నిర్వాహకులు సల్మాన్‌నే హోస్ట్‌గా కొనసాగిస్తున్నారు. ఒక్కో ఎపిసోడ్‌కు సల్మాన్ కోటి రూపాయలు తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిర్వాహకులు తను అడిగినంత ఇస్తున్నా సరే ఇక “బిగ్‌బాస్”కు ఫుల్‌స్టాప్ పెట్టాలని సల్మాన్ భావిస్తున్నాడట. కొన్ని సంవత్సరాలుగా సల్మాన్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడట. తీవ్ర పని ఒత్తిడే అనారోగ్యానికి కారణమని, విశ్రాంతి తీసుకోవాలని సల్మాన్‌కు వైద్యులు సూచించారట. దీంతో `బిగ్‌బాస్`కు స్వస్థి పలకాలని సల్మాన్ నిర్ణయం తీసుకున్నాడట. ఈ సీజనే సల్మాన్ హోస్ట్ చేసే లాస్ట్ సీజన్ అని సమాచారం. వచ్చే సీజన్‌కు బాలీవుడ్ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ హోస్ట్‌గా వ్యవహరించబోతోందని వార్తలు వస్తున్నాయి.

Related posts