telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘అన్న‌దాన్’ చాలెంజ్ తో ముందుకొచ్చిన సల్మాన్ ఖాన్

లాక్‌డౌన్ వ‌ల్ల నిరుపేద‌లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అంతా ఇంతా కాదు. రోజువారీ కూలీలు, నిరుపేదలు క‌డుపు నిండా తిండి లేక రోజుల త‌ర‌బ‌డి ప‌స్తులుంటున్నారు. మ‌న చుట్టూనే ఎంతోమంది అన్నం దొర‌క్క అల్లాడిపోతున్నారు. ఇలాంటివారిని ఆదుకునేందుకు బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ అన్న‌దాన్ చాలెంజ్ తీసుకువ‌చ్చాడు. అందులో భాగంగా మంగ‌ళ‌వారం ట్విట‌ర్‌లో ఓ ఫొటోను పంచుకున్నాడు. అందులో మ‌న హీరో, త‌న ఇద్ద‌రు స్నేహితులు బాబా సిద్ధిఖీ, జీశాన్ సిద్ధిఖీలతో క‌లిసి ఆహార పొట్లాల‌ను సిద్ధం చేస్తున్నాడు. వీటిని ఆహార కొర‌త‌తో బాధ‌ప‌డుతోన్న‌ ల‌క్షా 25వేల మందికి పంపిణీ చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. అంతేకాక కోవిడ్‌-19తో ఆర్థికంగా అత‌లాకుత‌లం అయిన పేద‌ల‌కు నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను అందించి ఆదుకోవాల‌ని అభిమానుల‌ను కోరాడు. కాగా స‌ల్మాన్‌ 25 వేల మంది సినీ కార్మికుల‌కు ఆర్థిక సాయం చేస్తాన‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

Related posts