telugu navyamedia
సినిమా వార్తలు

డబుల్ సెంచరీ కొట్టిన సల్మాన్… 200 కోట్ల క్లబ్బులో “భారత్”

BHarat

అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో కండల వీరుడు సల్మాన్ ఖాన్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ జంటగా నటించిన “భారత్” చిత్రం ఈద్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సౌత్ కొరియన్ సినిమా ఆడ్ టు మై ఫాదర్ ఆధారంగా పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కింది ఈ చిత్రం. ఈ సినిమా భారీ కలెక్షన్స్ తో హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. సల్మాన్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. తాజాగా “భారత్” చిత్రం రెండు వారాల్లో రూ.201.86 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. జాకీష్రాఫ్ ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ తండ్రి పాత్రలో నటించగా, సునీల్ గ్రోవర్ సల్మాన్ స్నేహితుడి పాత్రలో కనిపించాడు. టబు, దిశాపటానీ, నోరా ఫతేహి, ఆసిఫ్ షేఖ్ ఇతర పాత్రల్లో నటించారు. సినిమాలో “భారత్” అని పేరు పెట్టుకున్న సల్మాన్ తన దేశం పట్ల చూపించిన ప్రేమ ఆయన అభిమానులను బాగా ఆకట్టుకుంది. సల్మాన్ కి ప్రతి ఏడాది ఈద్ సెంటిమెంట్ కలిసొచ్చినట్లుగానే ఈ ఏడాది రంజాన్ కూడా కలిసొచ్చింది.

Related posts