telugu navyamedia
సినిమా వార్తలు

వెంకటేష్ కూతురు పెళ్లిలో సల్మాన్ సందడి

Venkatesh-and-Salman-KHan

దగ్గుబాటి వారి పెళ్ళి సందడి మొదలైపోయింది. దగ్గుబాటి వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత పెళ్ళి వేడుకలు జైపూర్ లో ఘనంగా మొదలయ్యాయి. హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు, రఘురామిరెడ్డి కుమారుడు వినాయక్ రెడ్డితో వెంకటేష్ కుమార్తె వివాహం జరుగుతోంది. వీరిది ప్రేమ పెళ్లి. రాజస్థాన్ జైపూర్ లో అంగరంగ వైభవంగా జరగనున్న ఈ పెళ్ళికి రాజకీయ ప్రముఖులతో పాటు టాలీవుడ్, బాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా విచ్చేయనున్నారు. ఇక ఈ వేడుకలో దగ్గుబాటి రానా, అక్కినేని నాగ చైతన్య, సమంత తమ డ్యాన్స్ లతో అదరగొట్టారు. బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సల్మాన్ ఖాన్, వెంకటేష్ ఇద్దరూ స్టార్స్ మాత్రమే కాదు మంచి స్నేహితులు కూడా. ఇక వెంకటేష్ కు బాలీవుడ్ స్టార్ హీరోలతో మంచి పరిచయాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. పెళ్లి తరువాత త్వరలోనే హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. వెంక‌టేష్ ప్ర‌స్తుతం వెంకీ మామ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక పెళ్లి కూతురు అశ్రిత ప్ర‌స్తుతం ఫుడ్ బిజినెస్ లో ఉంది. రామానాయుడు స్టూడియోలో కూడా ఓ స్టాల్ ఎప్ప‌టికీ ఉంటుంది.

Related posts