telugu navyamedia
telugu cinema news

ముద్దు సన్నివేశాలపై సల్మాన్ కామెంట్

Salman-Khan-and-Salman-Khan

బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్, నటి కత్రీనాకైఫ్ తమ ‘భారత్’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా “కపిల్ షో”కు హాజరయ్యారు. ఈ సందర్భంగా సల్మాన్, కత్రీనాలు ఒకరిపై మరొకరు సెటైర్లు వేసుకున్నారు. అలాగే కత్రీనా “చికనీ చమేలీ” పాటకు హుషారెత్తించే డాన్స్ చేశారు. సల్మాన్ తన బాల్య స్మృతులను ప్రేక్షకులతో పంచుకున్నాడు. చిన్నప్పుడు తాను ఎంతో అల్లరి చేసేవాడినని, ఒకసారి తన కారణంగా తన తమ్ముడు అర్బజ్ ఖాన్‌కు గాయమైందని తెలిపాడు. అప్పుడు తన తమ్ముడు పెన్సిల్‌తో ఆడుకుంటున్నాడని, తాను దానిని లాక్కొని అతని ఛాతీలో గట్టిగా గుచ్చానని, దీంతో ఆ పెన్సిల్‌ లోపలికి వెళ్లిపోయి, తన తమ్మునికి గాయమైందని తెలిపాడు. అలాగే సల్మాన్ తన మరో అనుభవాన్ని కూడా తెలియజేశారు. 1992లో విడుదలైన ‘సూర్యవంశీ’ చిత్రంలో తాను నటించానని, ఆ చిత్రంలో తనకు తలపై తెల్లని వెంట్రుకలు ఉన్నాయని, ఛాతీపైన మాత్రం నల్లని వెంట్రుకలు ఉన్నాయని, దీనిని ఎవరూ గమనించలేదని తెలిపాడు. తనకు క్లోజ్ డోర్ లిఫ్ట్ అంటే భయమని పేర్కొన్నాడు.

ఇక ముద్దు సన్నివేశాల గురించి మాట్లాడుతూ “రొమాంటిక్ స‌న్నివేశాలు, ముద్దు సీన్లు నాకు చాలా అసౌక‌ర్యంగా అనిపిస్తాయి. కుటుంబ‌మంతా క‌లిసి చూసే సినిమాలు చేయాల‌నే నేను కోరుకుంటా. తెర‌పై ముద్దు స‌న్నివేశాలు వ‌స్తున్న‌పుడు కొంద‌రు మొహం ప‌క్క‌కు తిప్పేసుకుంటారు. అది ఇబ్బందిక‌రంగా ఉంటుంది. ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రేక్ష‌కులు కూడా ముద్దు స‌న్నివేశాల‌ను లైట్ తీసుకుంటున్నారు. అయిన‌ప్ప‌టికీ నేను అలాంటి సన్నివేశాల్లో న‌టించ‌లేను. కొంద‌రు ద‌ర్శ‌కులు రొమాంటిక్ స‌న్నివేశాల్లో న‌టించ‌మ‌ని అడిగారు. కానీ, నేను అంగీక‌రించ‌లేదు” అని స‌ల్మాన్ చెప్పాడు. కాగా సల్మాన్ నటించిన “భారత్” జూన్ 5న విడుదల కానుంది.

Related posts

త్వరలో పెళ్ళి పీటలెక్కనున్న స్టార్ హీరోయిన్

ashok

“ఢీ”లో కంటెస్టెంట్ బుగ్గ కోరికేసిన హీరోయిన్…!?

vimala p

బిగ్ బాస్ హౌజ్‌లో గొడవ… వెక్కి వెక్కి ఏడ్చిన హిమజ

vimala p