telugu navyamedia
సినిమా వార్తలు

బాటిల్ క్యాప్ ఛాలెంజ్ పై సల్మాన్ సందేశం

Salman-Khan

ప్రస్తుతం సోషల్ మీడియాలో “బాటిల్ క్యాప్ ఛాలెంజ్” వైరల్ అవుతోంది. కికీ ఛాలెంజ్, ఐస్ బకెట్ ఛాలెంజ్ అంటూ రకరకాల ఛాలెంజ్‌లు యూత్‌ని ఉర్రూతలూగించాయి. ఇప్పుడు ఈ కొత్త ఛాలెంజ్ యూత్ ను అట్ట్రాక్ట్ చేస్తోంది. ఈ ఛాలెంజ్ లక్ష్యం ఏంటంటే ఓ టేబుల్‌పై బాటిల్‌ను పెట్టి, దానికి కొద్ది దూరంలో నిలబడి మూతను బాటిల్ కింద పడకుండా తన్నాలి. ఈ ఛాలెంజ్ ను బాలీవుడ్, టాలీవుడ్ నుంచి ప్రముఖ హీరోలు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో… ప్రముఖులతో పాటు యూత్ కూడా ఈ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఛాలెంజ్ ట్రెండింగ్ అవుతోంది. బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌, హాలీవుడ్‌ నటుడు జాసన్‌ స్టాథమ్‌, టాలీవుడ్‌లో అర్జున్‌, కార్తికేయ బాటిల్‌ మూతను ఒకే కిక్‌తో తీశారు. కొందరేమో చేతితో మూత తీసి నీళ్లు తాగేసి ఫన్ చేశారు. వీరందరి కన్నా భిన్నంగా ఈ ఛాలెంజ్‌ పూర్తి చేశారు బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌. అంతేకాదు “బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్” ద్వారా అభిమానులకు మంచి సందేశం కూడా ఇచ్చారు సల్మాన్. భగవంతుడికి నమస్కారం చేసి బాటిల్‌ క్యాప్‌ను నోటితో ఊది నీళ్లు తాగుతూ “బాటిల్‌ను తన్నకండి.. నీటిని కాపాడండి” అని ఓ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. నిమిషాల్లోనే 60వేల మంది లైక్‌ చేశారు.

Related posts