చైనా పై దృష్టిపెట్టిన సల్మాన్…

భారతదేశంలో సల్మాన్ ఖాన్ కు విపరీతమైన క్రేజ్.. అందుకే అతడి సినిమాలు అలవోకగా 100కోట్లను కొల్లగొడుతుంటాయి.. సల్మాన్ ఖాన్ నటించిన గత 10చిత్రాల్లో ఎక్కువ శాతం బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసినవే… అతడి అన్ని చిత్రాల్లోకెల్లా 2015లో వచ్చిన ‘భజ్రంగీ భాయిజాన్’కు ప్రత్యేక స్థానం ఉంది. టాలీవుడ్ రచయిత వి.విజయేంద్రప్రసాద్ కథ అందించిన ఈ చిత్రం సల్మాన్ ఖాన్ కెరీర్లోనే అత్యంత భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం రికార్డులను ఇటీవలే వచ్చిన ‘టైగర్ జిందా హేయ్’ తుడిచిపెట్టింది.

ఇప్పుడు తాజాగా సల్మాన్ చైనీస్ మార్కెట్ పై దృష్టి పెట్టినట్లున్నాడు. సల్మాన్ ఖాన్ , కరీనా కపూర్ జంటగా నటించిన ‘భజ్రంగీ భాయిజాన్’ చిత్రం చైనా దేశంలో త్వరలోనే విడుదల కానుంది. ఈ చిత్రాన్ని చైనీస్ భాషలోకి ఎరోస్ ఇంటర్నేషనల్ – చైనాస్ ఈ స్టార్స్ ఫిలిమ్స్ సంయుక్తంగా విడుదల చేస్తున్నాయి. ఈ చిత్రం మార్చి 2న చైనాలో విడుదల కానుంది. చైనా మొత్తంమీద సుమారు 8000 స్క్రీన్లలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన చైనీస్ పోస్టర్ ఈరోజు విడుదలైంది. సల్మాన్ ఖాన్ నటించిన ఓ చిత్రం చైనీస్ భాషలోకి అనువాదమవ్వడం ఇదే మొదటిసారి కావడం విశేషం…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *