telugu navyamedia
సినిమా వార్తలు

ముద్దు సన్నివేశాలకు సల్మాన్ దూరం ?

Salman-Khan

బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ మూడు దశాబ్దాలుగా సినిమాలు చేస్తున్నా… ఆన్ స్క్రీన్ లో హీరోయిన్లకు ఎప్పుడూ ముద్దులు పెట్టలేదు. అయితే ఇటీవల ఓ మీడియా సమావేశంలో సల్మాన్ ఆన్ స్క్రీన్ లో హీరోయిన్లకు ఎందుకు ముద్దులు పెట్టరు? అనే విషయం ప్రస్తావనకు వచ్చింది. దీనికి స్పందించిన సల్మాన్ ఆన్ స్క్రీన్ లో అమ్మాయిలకు ముద్దులు పెట్టడం అనేది తనకు అంత సౌకర్యంగా అన్పించదని, అందుకే తన సినిమాల్లో ముద్దు సన్నివేశాలు ఉండవని చెప్పుకొచ్చారు.

ఆ సమయంలో సల్మాన్ పక్కనే ఉన్న అతడి తమ్ముడు అర్భాజ్ ఖాన్ వెంటనే ” అన్నయ్య ఆఫ్ స్క్రీన్ లో అమ్మాయిలకు చాలా ముద్దులు ఇస్తాడు… కానీ దాన్ని స్క్రీన్ మీద చేయడం ఆయనకు ఇష్టం లేదు” అంటూ చేసిన చమత్కారానికి అక్కడున్న వారంతా నవ్వేశారు. తన కుటుంబ సభ్యులంతా కలిసి చూసే విధంగా సినిమాలు ఉండాలని సల్మాన్ భావిస్తాడని, అందుకే లిప్ లాక్ సన్నివేశాలకు సల్మాన్ దూరంగా ఉంటారని అంటుంటారు.

Related posts