telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

న్యాయ వ్యవస్థ బీజేపీ చేతుల్లో ఉంటుందా..?

Sajjala ycp

బెయిల్ పై ఉన్న జగన్ ఏ క్షణమైనా జైలుకెళ్లొచ్చు.. జగన్ బెయిల్ ఏ క్షణమైనా రద్దయ్యే అవకాశం ఉందంటూ.. బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ థియోధర్ చేసిన వ్యాఖ్యలకు అదే రేంజ్‌లో కౌంటర్ ఇచ్చారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం వైఎస్ బెయిల్ రద్దు అవుతుందని బీజేపీ నేతలు ముందే ఎలా చెప్తారు..? న్యాయ వ్యవస్థ బీజేపీ చేతుల్లో ఉంటుందా..? అని ప్రశ్నించారు.. బీజేపీ కేంద్రంలో ఉందని ఏది మాట్లాడిన ప్రజలు వింటారని అనుకుంటున్నారా..? అంటూ ఫైర్ అయిన ఆయన.. వ్యవస్థలపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలని అనుకుంటున్నారూ అని ఫైర్ అయ్యారు.  ఇక, బీజేపీ, జనసేన, టీడీపీ లోపాయికారికంగా పని చేస్తున్నాయని ఆరోపించారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్ర జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు వెనుక ఉండి ఇదంతా చేయిస్తున్నారని విమర్శించిన ఆయన.. టీడీపీని వీడి బీజేపీలోకి వెళ్లిన వారితో  ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు.

Related posts