telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

నిమ్మగడ్డపై ఆగ్రహం వ్యక్తం చేసిన సజ్జల…

Sajjala ycp

కేవలం 6 రోజుల్లో ఎంపీటీసీ ,జడ్పీటీసీ ఎన్నికలు పూర్తవుతాయని అన్నారు. వీటిని నిర్వహించకుండా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్   సెలవుపై వెళ్లాలని నిర్ణయం తీసుకోవటం విడ్డూరంగా ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎస్ ఈసీ  సెలవులను  వాయిదా వేసుకుని వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. పురపాలక ఎన్నికల్లో ఏది జరిగినా పారదర్శకంగా, ప్రజల ఇష్టం మేరకే వ్యవహరించాలని సీఎం ఆదేశించారని అన్నారు. అనుకూలంగా లేని చోట్ల ఎవరినీ ప్రలోభాలకు గురి చేయవద్దని సీఎం ఆదేశించారని అన్నారు. ఇక కడప జిల్లా పొద్దుటూరు మున్సిపాలిటీ  మాకు కలసి వచ్చిందని, తాడిపత్రి లో సభ్యుల ఇష్టప్రకారం వ్యవహరించేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. రిజర్వేషన్ల విషయంలో సీఎం వైఎస్ జగన్ మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించారన్న ఆయన మొత్తం 78 శాతం మందిని బీసీలు, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారు మేయర్, ఛైర్మన్ స్థానాల్లో నియమించారని అన్నారు. దేశ చరిత్రలోనే ఇది అరుదైన సన్నివేశం అన్నారు. మహిళలు, బీసీలు, ఎస్సీ ఎస్టీలకు పదవుల్లో పెద్దపీట వేశారని అన్నారు.

Related posts