telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆదిపురుష్ : రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్

Adipurush

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన 22వ చిత్రంగా ‘ఆదిపురుష్‌’ అనే సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ (తానాజీ ఫేమ్) దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే భారీ చిత్రం తెరకెక్కనుంది. ‘చెడు మీద మంచి సాధించిన విజయం’ అనేది ట్యాగ్ లైన్. రామాయణం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘ఆదిపురుష్’ సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాని దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో టీ-సిరీస్ నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే విడుదలయిన మోషన్‌ పోస్టర్‌ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఇప్పుడు “ఆది పురుష్”లోని కొన్ని కీలక యుద్ధ సన్నివేశాల కోసం విలువిద్య నేర్చుకోనున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు.. అయితే ప్రభాస్ రాముడు అనగానే రావణాసురిడిగా ఎవరు నటించబోతున్నారు అనే విషయం అందరిలోనూ ఆసక్తిని రేపింది. అయితే ఇప్పుడు దానికి సమాధానం ఇచ్చేసింది చిత్రబృందం. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నట్లు ఓ పోస్ట్ విడుదల చేస్తూ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమాలో సీతగా ఎవరు నటించనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.

Related posts