telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“లవ్ యూ మామ” అంటూ చిరుపై సాయి ధరమ్ తేజ్ ట్వీట్

Sai Dharam Tej

 “ప్రతిరోజూ పండగే” సినిమాతో భారీ విజయం అందుకున్నాడు మెగా హీరో సాయితేజ్. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం “సోలో బ్రతుకే సో బెటర్”. సుబ్బు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ‌షూటింగ్‌ పూర్తయింది. ‘ప్రతిరోజు పండగే’ తేజ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. నభనటేష్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు రెండు వీడియో సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో నేడు సాయి ధరమ్ తేజ్ బర్త్ డే సందర్భంగా తాజాగా ‘అమృత’ లిరికల్ సాంగ్ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. తమన్ సంగీతం అందించారు. అమృత ప్రేమలో పడిన విరాట్.. బ్రేకప్ తర్వాత పాడుకునే ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. అయితే చిరంజీవి ట్వీట్ పై హీరో సాయి ధరమ్ తేజ్స్పందించాడు. మెగాస్టార్ చిరంజీవిపై ఉన్న ప్రేమను కురిపించేసాడు. ఇంతకంటే గొప్పగా బర్త్ డే గిఫ్ట్ కావాలని ఏం అడగగలం…థ్యాంక్స్ మామ..లవ్ యు సో మచ్ మామ అంటూ ట్వీట్ చేసాడు.

Related posts