telugu navyamedia
సినిమా వార్తలు

కోలీవుడ్ దర్శకుడితో సాయి పల్లవి ప్రేమాయణం ?

Sai Pallavi images

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో హీరోయిన్ సాయి పల్లవికి మంచి క్రేజ్ ఉంది. న్యాచురల్ బ్యూటీగా తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల సరసన వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ ఓ తమిళ దర్శకుడితో ప్రేమలో పడిందని, త్వరలోనే పెళ్ళి చేసుకునే అవకాశం ఉందని కోలీవుడ్ మీడియా కొసకి కూస్తోంది. దర్శకుడు ఏ.ఎల్ విజయ్ తో ప్రేమలో పడిందనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. గతంలో విజయ్ దర్శకత్వంలో సాయి పల్లవి “కణం” చిత్రంలో నటించింది. ఆ సమయం నుంచే వీరిద్దరి మధ్య ప్రేమ నడుస్తోందని అంటున్నారు. అయితే సాయి పల్లవి సన్నిహితులు మాత్రం ఇవన్నీ పుకార్లేనని కొట్టిపారేస్తున్నారు. ఇటీవలే సాయి పల్లవి కూడా ఓ ఇంటర్వ్యూలో అసలు తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమే లేదని చెప్పుకొచ్చింది. మరోవైపు ఈ వార్తపై సాయి పల్లవి అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే గతంలో విజయ్ హీరోయిన్ అమలాపాల్ ను పెళ్ళి చేసుకుని, 2 సంవత్సరాలు కలిసి ఉన్న తరువాత విడిపోయారు.

Related posts