telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఈ ఏడాది వరుస సినిమాలతో రానున్న స్టార్ హీరోయిన్…

Sai Pallavi

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో సాయి పల్లవి ముందు వ‌రుస‌లో ఉంటారు. ఇది ఆమెను మిగిలిన హీరోయిన్ల కంటే ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకునేలా చేసింది. ‘ఫిదా’ లాంటి హిట్ సినిమాతో ఒక్కసారిగా ఈ బ్యూటీ స్టార్ పాపులారిటీని సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతం సాయి పల్లవి టైం నడుస్తుందనే చెప్పాలి. ఏ స్టార్ హీరోయిన్ చేతిలో లేనన్ని సినిమాలు ఇప్పుడు ఈమె చేతిలో ఉన్నాయి. దింతో 2021లో చాలా బిజీ హీరోయిన్ గా మారింది. సాయి పల్లవి ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న ‘లవ్ స్టోరీ’ సినిమాను కంప్లీట్ చేసుకుంది. మరోవైపు ‘విరాట పర్వం’ సినిమాలో నటిస్తోంది. దీనితో పాటు నాని హీరోగా రాబోతున్న ‘శ్యామ్ సింగ రాయ్’ లో కూడా నటిస్తుంది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్‌’ రీమేక్ మూవీలో నటించే అవకాశం వచ్చినట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు, గోపీచంద్ హీరోగా రాబోతున్న ‘అలివేలుమంగ వెంకటరమణ’ సినిమాలో కూడా సాయి పల్లవి నటించబోతున్నారని తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమాతో సాయి పల్లవి ఎక్కడికి వెళ్తుంది అనేది.

Related posts