telugu navyamedia
సినిమా వార్తలు

ఏ క్షణమైనా సినిమాలోంచి తప్పుకుంటా… డాక్టర్ అవుతా.. : సాయి పల్లవి

Sai-Pallavi

ప్రేమమ్, ఫిదా చిత్రాలతో ప్రేక్షకులను ఫిదా చేసి యూత్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది సాయి పల్లవి. గ్లామ‌ర‌స్ పాత్ర‌ల‌కు, క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు దూరంగా మంచి న‌ట‌న‌, అద్భుత‌మైన డ్యాన్సింగ్ స్కిల్స్‌తో ద‌క్షిణాదిన ఎంతోమంది అభిమానులను సంపాదించ‌కుంది. త‌మిళ‌, మ‌ల‌యాళ‌, తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ల్లో పలు సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. అయితే సాయి ప‌ల్లవి న‌ట‌న‌లోనే పూర్తిగా కొన‌సాగాల‌నుకోవ‌డం లేదనే విషయాన్నీ తెలిపి అభిమానులకు షాకిచ్చింది. తాను ఆశించిన పాత్ర‌లు రాక‌పోతే ఏ క్ష‌ణ‌మైనా సినిమాల నుంచి త‌ప్పుకుంటుంద‌ట‌. సాయి ప‌ల్ల‌వి మెడిస‌న్ చ‌దివిన సంగ‌తి తెలిసిందే. న‌టిగా ఆమెకు పేరు ప్ర‌ఖ్యాత‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ డాక్ట‌ర్ కావాల‌నేది ఆమె క‌ల‌. అందుకే విదేశాల్లో వైద్య విద్య‌ను అభ్య‌సించింది. సినిమాల నుంచి త‌ప్పుకున్న త‌ర్వాత సాయి ప‌ల్ల‌వి పూర్తి స్థాయి డాక్ట‌ర్‌గా మారుతుంద‌ట‌. సాయి పల్లవి ఇప్పటి వరకూ గ్లామరస్ పాత్రల జోలికి వెళ్ళలేదు. అయితే సాయి పల్లవి ఆశిస్తున్న పాత్రలతోనే దర్శకనిర్మాతలు ఆమె దగ్గరకు కథలతో వెళ్లాలన్నమాట.

Related posts