telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరో సినిమాకు ఓకే చెప్పిన మెగా హీరో..

Sai Dharam Tej

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వరుసగా కొత్త కథలతో సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం సాయి సోలో బ్రతుకే సో బెటర్ అంటూ ఈ క్రస్మస్‌కు అందరికి గిఫ్ట్ ఇవ్వనున్నాడు. ఈ హీరో తరువాతి సినిమాను సుకుమార్‌తో ప్లాన్ చేశాడు. అయితే దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశాడు. ఈ సినిమాను సుకుమార్ వ్రైటింగ్స్ బ్యానర్‌పై సుకుమార్, బీవీఎస్ఎన్ ప్రసాద్ కలిసి నిర్మించబోతున్నారు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమా 1970 బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కనుంది. ఈ సినిమా సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో తీయనున్నారు. దీనికి తోడు ఈ సినిమా థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్ సాయి ప్రస్తుత సినిమా విడుదల తరువాత మొదలు కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే సోలో బ్రతుకే సో బెటర్ సినిమా రొమాంటిక్ కామెడీగా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా ఈ ఏడాది మే నెలలో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే క్రస్మస్‌కు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతోంది.

Related posts