telugu navyamedia
సినిమా వార్తలు

అమ్మకి రెండో పెళ్ళి చేశాను… మెగా హీరో

Sai-Dharam-Tej

వరుస పరాజయాలతో సతమతమవుతున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు “చిత్రలహరి” సక్సెస్ కొంత ఊరటనిచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా విజయంతో హ్యాపీగా ఉన్న సాయి తేజ్ ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. తాను పదో తరగతి చదివేప్పుడే అమ్మానాన్న విడాకులు తీసుకున్నారని, ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు రావడంతో పెళ్లైన 15 ఏళ్లకు విడిపోయారని, తండ్రి లోటు తెలియకుండా తనను, తమ్ముడిని అమ్మ పెంచిందని ఈ మెగాహీరో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తన తండ్రి పశ్చిమగోదావరి జిల్లాలో తన సొంతూరులో ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటికీ ఆయనతో టచ్ లో ఉన్నట్లు, ఆయన సినిమా రంగానికి చెందిన వారు కాకపోవడంతో సినిమాల గురించి చర్చించుకోమని తెలిపారు. నాన్నతో విడిపోయిన తరువాత 2011లో అమ్మకి రెండో పెళ్లి చేశామని, తాను, తమ్ముడు పెళ్లిళ్లు చేసుకుంటే అమ్మ ఒంటరిగా ఉంటుందనే భావనతో రెండో పెళ్లికి ఒప్పించామని అన్నాడు. తన తల్లిని పెళ్లాడిన వ్యక్తి కంటి డాక్టర్ అని, చాలా మంచివాడని, అమ్మని బాగా చూసుకుంటారని, ప్రస్తుతం తను, తన తమ్ముడు ఆయనతోనే కలిసి ఉన్నామని స్పష్టం చేశారు.

 

Related posts