telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

సోలో బ్రతుకే సో బెటర్ మొదటి రోజు కలెక్షన్స్…’

Sai Dharam Tej

కరోనా కారణంగా చాలా రోజులు మూసుకున్న థియేటర్లు నిన్న తెరుచుకున్నాయి. నిన్న క్రిస్మస్ సందర్బంగా… మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన సరికొత్త సినిమా సోలో బ్రతుకే సో బెటర్ నిన్న విడుదలైంది. అయితే ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్‌తో నిర్మాతలు హ్యాపీనా అనేది ఇంకా తెలీలేదు. అయితే ఈ సినిమా సుబ్బు దర్శకత్వంలో రూపొందింది. దాదాపు పది నెలల తరువాత థియేటర్లో సినిమా విడుదలైతే ప్రేక్షకులు వస్తారా అనే అనుమానాలకు ఈ సినిమా చెక్ చెప్పింది. భారీ అంచనాలతో విడుదలైన సినిమా మంచి రెస్పాన్స్ పొందడంతో అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా మొదటి షో నుంచి మంచి వసూళ్లే చేసిందని అంటున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే దాదాపు రూ.91.37లక్షల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా తొలిరోజే రూ.4కోట్లు సంపాదించింది. ఈ మహమ్మారి కరోనా సమయంలోనూ ఈ రేంజ్ వసూళ్లు కావడం నిర్మాతలకు తీసి కబురనే చెప్పుకోవచ్చు. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ పెట్టకపోవడం వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపిందని, లేకుంటే కలెక్షన్లు వేరే లెవెల్లో ఉండేవని అంటున్నారు. ఈ సినిమా హిట్ అవ్వడంతో చిత్ర యూనిట్ సెలబ్రేట్ చేసుకుంది.

Related posts