telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పెళ్లిపై ఇంట్రస్ట్ లేదు… వాళ్ళకోసమే అలా చెప్పా : సాయి ధరమ్ తేజ్

Sai Dharam Tej

మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ ఇటీవలే 35వ పుట్టినరోజు జరుపుకున్నారు. అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన తేజ్ పెళ్లి విషయం ఇప్పుడు టాలీవుడ్ లో హల్చల్ చేస్తోంది. ఇటీవల ఆయనకు బర్త్‌డే విషెస్ చెప్పిన మేనమామ చిరంజీవి.. ‘సోలో లైఫ్ ఇంకొన్ని రోజులే.. ఎంజాయ్ చేయ్’ అంటూ సెటైర్ వేశారు. దీంతో తేజ్ తర్వలోనే పెళ్లి పీటలెక్కడం ఖాయమన్న అభిప్రాయానికి ఫ్యాన్స్ వచ్చేశారు. ఈ నేపథ్యంలోనే పెళ్లిపై షాకింగ్ కామెంట్ చేశాడు సాయిధరమ్‌ తేజ్. తనకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, అయితే పెళ్లిపై తనకు ఆసక్తి లేదని తాజా ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘ఇంట్లో వాళ్లు నాకు పెళ్లి చేసేయాలని నిర్ణయానికి వచ్చేశారు. వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక సంబంధాలు చూడమని చెప్పా. అంతకుమించి పెళ్లిపై నాకెలాంటి ఇంట్రస్ట్ లేదు. ఒకవేళ అమ్మాయి నచ్చితే అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తా’ అంటూ క్లారిటీ ఇచ్చాడు తేజ్. ఇక ప్రస్తుతం సాయి సాయి ధరమ్ తేజ్ నటించిన “సోలో బ్రతుకే సో బెటర్” సినిమా విడుదలకు సిద్ధంగాను ఉంది.

Related posts