ఇటీవల “ప్రతిరోజూ పండగే” సినిమాతో భారీ విజయం అందుకున్నాడు మెగా హీరో సాయితేజ్. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం “సోలో బ్రతుకే సో బెటర్”. సాయితేజ కు జోడిగా నభా నటేష్ నటిస్తోంది. సుబ్బు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సాయితేజ్ తాజాగా ఓ ట్వీట్ చేశాడు. సోలోగా ఉంటే వచ్చే లాభాలను తెలియజేస్తూ ఓ ట్వీట్ చేశాడు.
“సోలో బ్రతుకే సో బెటర్”గా నేను జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నాను. ఎందుకంటే…..
1. ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోతే నేను టెన్షన్ పడను.
2.రెస్టారెంట్‌కు వెళితే నా ఫుడ్‌కి మాత్రమే నేను డబ్బులు చెల్లిస్తాను. (పర్సుకు చిల్లు పడే ఛాన్సే లేదు)
3.క్రికెట్ ఆడేటపుడు కాల్ వచ్చి గేమ్ మధ్యలో వెళ్లాల్సిన పని నాకు లేదు.
4. షూట్, క్రికెట్, జిమ్, ఇల్లు, స్నేహితులు – నాకు నచ్చినంత సమయం, నాకు నచ్చిన వాటితో నేను గడపొచ్చు.
ఇంకా సింగిల్ ఆర్మీ జీవితాల గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ అనుభవాలను #whysolobrathukesobetter, #singleswag హ్యాష్‌ట్యాగ్‌లతో తెలియజేయండి` అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు స్పందించిన మంచు విష్ణు “తమ్ముడూ సాయితేజ్.. నువ్వు చేసిన ఈ ట్వీట్‌ను నేను సేవ్ చేశా. నువ్వు ఎంతకాలం ఇలా సోలోగా ఉంటావో చూస్తాగా. ఆల్ ది బెస్ట్ ఫర్ `సోలో బ్రతుకే సో బెటర్” అని సరదాగా రిప్లై ఇచ్చాడు.
Tammudu, my little brother @iamSaiDharamTej . Ee tweet nenu save chesukuna. Inka Yeni rojulu Solo chustaga 😈. All the best for #SoloBrathukeSoBetter https://t.co/VwCFvH1O3d
— Vishnu Manchu (@iVishnuManchu) February 8, 2020
మాది పెద్ద సినిమా కాదు.. గొప్ప సినిమా..