telugu navyamedia
సినిమా వార్తలు

ఫారిన్ భామతో మెగా హీరో డేటింగ్ ?

Sai-Dharam-Tej-and-Larissa-Bonesi

సాయి ధరమ్ తేజ్ నటించిన “తిక్క” సినిమాలో హీరోయిన్ బ్రెజిలియన్ బ్యూటీ లారిస్సా బోనేసి. అయితే ఆ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో ఆ ముద్దుగుమ్మకు తెలుగులో అవకాశాలు రాలేదు. చాలాకాలం తరువాత “నెక్స్ట్ ఏంటి” సినిమాలో అవకాశం దక్కింది. కానీ ఆ సినిమా కూడా డిజాస్టర్… దీంతో ఈ అమ్మడు తన మకాం ముంబైకి మార్చేసి అక్కడే మోడలింగ్ చేస్తోంది. తాజాగా మెగా హీరోల్లో ఒకరైన సాయి ధరమ్ తేజ్ ఈ బ్యూటీతో డేటింగ్ చేస్తున్నట్లు ముంబై వర్గాల సమాచారం. ఆమెను చూడడం కోసమే ఈ సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ ముంబై వెళ్ళాడట. సాయి ధరమ్ తేజ్ ఫోటోను లారిస్సా ట్విట్టర్ లో షేర్ చేయడంతో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయం ముందే తెలిసినవారు మాత్రం అది సీరియస్ రిలేషన్షిప్ కాదని కొట్టిపారేస్తున్నారు. గతంలో “తిక్క” సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే లారిస్సాతో సాయి ధరమ్ తేజ్ సన్నిహితంగా ఉండేవాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలోనే తేజ్ ఆమెను డేటింగ్ కు పిలిచాడట. కానీ అప్పుడు లారిస్సా తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి తప్పించుకుందట.

Related posts