telugu navyamedia
సినిమా వార్తలు

అది నిజజీవితంలో నా తల్లి పాత్ర : సాయి ధరమ్ తేజ్

valentine single challenge by saidharmatej

సాయిధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన చిత్రం “చిత్రలహరి”. ఈనెల 12న విడుదలైంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఈ లవ్ స్టోరీకి అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ సక్సెస్ మీట్ ను నిర్వహించింది. ఈ వేదికపై సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ “వరుస పరాజయాల తరువాత ఈ విజయం దక్కింది. దర్శకుడితో కలిసి నేను .. సునీల్ .. హైపర్ ఆది స్క్రిప్ట్ విషయంలో కసరత్తు చేశాము. రెస్పాన్స్ ను చూస్తుంటే మా ప్రయత్నం ఫలించిందని అనిపిస్తోంది. అన్ని ప్రాంతాల నుంచి హిట్ టాక్ వస్తుండటం ఆనందంగా వుంది .. ఈ విజయం నా ఒక్కడిదే కాదు .. అందరిది” అని అన్నాడు. “ఈ సినిమాలో పోసాని పోషించిన నా తండ్రి పాత్ర నాకెంతో ఇష్టం. ఈ పాత్ర అనుక్షణం నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తూ వుంటుంది. నిజ జీవితంలో ఈ పాత్ర నా తల్లిపాత్రకి దగ్గరగా అనిపించి మనసు భారమయ్యేది” అని చెప్పుకొచ్చాడు.

Related posts