telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

సచిన్‌ దాతృత్వం : వైద్యానికి భారీ సాయం

Sachin tendulkar

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. ఆరు రాష్ట్రాల్లో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 100 మంది పేద పిల్లల చికిత్సకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని అందించాడు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, అసోం, కర్ణాటక, తమిళనాడు, ఏపీ రాష్ట్రాల్లో ఉన్న చిన్నారులకు “ఎకాం” ఫౌండేషన్‌ తో కలిసి సాయం చేశాడు. “ఫౌండేషన్‌లో సచిన్‌తో కలిసి పనిచేస్తుండటం ఎంతో సంతోషంగా ఉంది. ఆరోగ్య రంగంలో సచిన్‌ గొప్పగా పనిచేస్తున్నారు. పేద పిల్లలకు మరిన్ని వైద్యారోగ్య సదుపాయాలు అందించడానికి ప్రయత్నిస్తాం” అని ఎకాం ఫౌండేషన్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ అమీతా ఛటర్జీ తెలిపారు. ప్రతి ఏడాది ఇలానే రెండు వేల మందికి పైగా సహాయం అందించాలని భావిస్తున్నారు. కాగా.. యునెసెఫ్‌కు సౌహార్ద రాయబారిగా ఉన్న సచిన్‌ ఇటీవల అసోంలోని కరీంగంజ్‌ జిల్లాలో ఉన్న మకుంద ఆస్పత్రికి వైద్య పరికరాలను దానం చేసిన విషయం తెలిసిందే.. దీంతో.. సచిన్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.  

Related posts