telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

బిగ్ బ్రేకింగ్: తెలంగాణలో స్కూల్స్, కాలేజీలు బంద్

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి తాత్కాలికంగా విద్యాసంస్థలు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లలో విపరీతంగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసెంబ్లీలో విద్యా శాఖ సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. కరోనా నియంత్రణకు ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన ఆమె.. ఆన్‌ క్లాసులు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. అలాగే మెడికల్‌ కాలేజీలు… బంద్‌ నుంచి మినహాయింపు ఉంటుందని ఆమె ప్రకటించారు. విద్యాసంస్థలు మూసి వేయాలని తల్లిదండ్రుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని…విద్యార్థులు, తల్లిదండ్రుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యాసంస్థలు తాత్కాలికంగా మూసి వేస్తున్నామని మంత్రి సబితా తెలిపారు. పొరుగు రాష్ట్రాలలో విద్యాసంస్థలు మూసివేసిన సందర్భంలో తెలంగాణలో కూడా విద్యాసంస్థలు తాత్కాలికంగా మూసివేస్తున్నామని తెలిపారు.

Related posts