telugu navyamedia
సినిమా వార్తలు

సాహో అప్డేట్ : విలన్ కు వీడ్కోలు

Arun-Vijay

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “సాహో”. ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడిగా శ్రద్ధాకపూర్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం చాలావరకు షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో ప్రభాస్ కు విలన్ గా అరుణ్ విజయ్ నటిస్తున్నారు. తమిళనాట ఒకవైపున హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తూనే, మరో వైపున విలన్ పాత్రలను చేస్తూ యంగ్ విలన్ గా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. కొన్ని రోజులుగా అరుణ్ విజయ్ కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో ఆయన పాత్రకు సంబంధించిన షూటింగు పూర్తయ్యింది.

ఈ సందర్భంగా ఆయనతో కేక్ కట్ చేయించిన ఈ సినిమా టీమ్ అరుణ్ విజయ్ కు వీడ్కోలు పలికింది. ఇక ఈ చిత్రం నుంచి ‘షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్-1″ అంటూ గతంలో విడుదల చేసిన వీడియోతో ప్రేక్షకుల్లో సినిమాపై అమాంతం అంచనాలు పెరిగిపోయాయి. శ్రద్ధాకపూర్ పుట్టినరోజు సందర్భంగా “షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్-2” పేరుతో శ్రద్ధాకపూర్ కు సంబంధించిన మేకింగ్ వీడియో ను విడుదల చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో రికార్డుల మోత మోగిస్తోంది. ప్రభాస్ – శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తోన్న ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నారు.

Related posts