telugu navyamedia
telugu cinema news

పాపులర్ టీవీ షోలో “సాహో” టీం

Saaho

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “సాహో”. సుజిత్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్‌లో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా భారీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ ఇతర కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు. “బాహుబలి” తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంపై ఉన్న అంచనాలు కారణంగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగినట్లు వార్తలు వినపడుతున్నాయి. ఇప్ప‌టికే ఈ సినిమాపై ఓ రేంజ్ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉండడంతో అభిమానులు తొలి రోజే ఈ సినిమాని వీక్షించేందుకు పోటీలు ప‌డుతున్నారు. అయితే టాప్ మోస్ట్ రేటింగ్ టీవీ ప్రొగ్రాం “ది కపిల్ శర్మ షో”. ఈ షో ఎంత ఫేమ‌స్ అనేది మ‌నంద‌రికి తెలిసిందే. ఈ షోకి వ్యాఖ్యాత‌గా ప్ర‌ముఖ హిందీ క‌మెడీయ‌న్ క‌పిల్ శ‌ర్మ వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ప‌లువురు బాలీవుడ్ సెల‌బ్రిటీలు ఈ షోకి వచ్చి మ‌రీ త‌మ సినిమాని ప్ర‌మోట్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా ప్ర‌భాస్, శ్ర‌ద్దా క‌పూర్‌, నీల్ నితిన్ ముఖేష్ ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రై తమ సినిమాకి సంబంధించిన విష‌యాలు షేర్ చేసుకున్నారు. క‌పిల్‌తో ప్ర‌భాస్ అండ్ టీం చేసిన సంద‌డి టీవీ ప్రేక్ష‌కుల‌కి ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తుంద‌ని అంటున్నారు.

Related posts

పవన్ చిత్రానికి ఆసక్తికర టైటిల్…?

vimala p

“ఓ బేబీ” సక్సెస్ సెలెబ్రేషన్స్

vimala p

చిరంజీవి బ్లడ్ బ్యాంకు కు .. అరుదైన గౌరవం..

vimala p