telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సాహోతో .. రాజమౌళి..

saaho, rrr and balakrishna at single place for shoot

అటు ప్రభాస్ సాహో చిత్రంలో బిజీగా ఉన్నాడు; ఇటు రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ మూవీ తో బిజీగా ఉన్నాడు. వీళ్లిద్దరు ఒక్కచోటకు చేరారు అంటే ఎలా అనుకోకండి.. ఈ రెండు షూటింగులు ఒకే చోట జరుగుతున్నాయట. సాహో విషయానికి వస్తే చాలా వరకు షూటింగ్ పూర్తిచేసుకోగా, ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చాలా వరకూ చిత్రీకరించారు. భారీ తారాగణంతో .. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమా, ప్రస్తుతం హైదరాబాద్ – రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రభాస్ తదితరులపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఇక చరణ్ సినిమా షూటింగ్ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరుగుతోంది. రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీకి సంబంధించి, చరణ్ కాంబినేషన్లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను ఇక్కడ షూట్ చేస్తున్నారట. ఈ సినిమాలో చరణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడనే టాక్ ఉంది. ఇక ఇక్కడే బాలకృష్ణ ‘మహానాయకుడు’ సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. మొత్తానికి స్టార్ హీరోలంతా ఎవరి సినిమాల షూటింగులతో వాళ్లు బిజీబిజీగా ఉన్నారు.

Related posts