telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్టార్ హీరోల “సాహో” బ్యాంగ్ వెర్షన్

Saaho

ప్రభాస్ ప్రధాన పాత్రలో సుజీత్‌ దర్శకత్వం వహించగా, యూవీ క్రియేషన్స్‌ సంస్థ దాదాపు 350 కోట్లతో నిర్మించిన చిత్రం “సాహో”. ఈ చిత్రం భారీ అంచనాలతో ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. యూవీ క్రియేషన్స్‌ నిర్మించిన ఈ చిత్రంలో నీల్‌ నితిన్‌ ముఖేష్‌, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, వెన్నెల కిశోర్‌, మందిరా బేడీ కీలక పాత్రల్లో నటించారు. శ్ర‌ద్ధా క‌పూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఇప్పటి వరకు 400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని నిర్మాతలే అనౌన్స్ చేసారు. అయితే చిత్ర‌యూనిట్ తాజాగా సెప్టెంబ‌ర్ 1న చిత్ర మేక‌ర్స్ సాహో హై ఓల్టేజ్ యాక్ష‌న్ అంటూ ఓ వీడియోని విడుద‌ల చేశారు. ఇందులోని స్టంట్స్‌తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అభిమానులని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. అయితే కొంద‌రు ఔత్సాహికులు త‌మ అభిమాన హీరోల యాక్ష‌న్ స‌న్నివేశాల‌కి సాహో బీజీఎం జ‌త చేసి స్పెష‌ల్ వీడియోలు రూపొందించారు. ప్ర‌స్తుతం ఈ వీడియోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. మీరు కూడా ఈ వీడియోలను వీక్షించండి.

Related posts