telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఎస్ 5” మూవీ లాంచ్

S5

తార‌క‌ర‌త్న, ప్రిన్స్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా స‌న్నీ కొమ‌లపాటి తెర‌కెక్కిస్తున్న‌చిత్రం “ఎస్ 5”. “నో ఎగ్జిట్” అనేది క్యాప్షన్. అవంతిక‌, రుతుజ సావంత్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. జీఎస్‌కే మీడియా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తుండ‌డం విశేషం. దీపావ‌ళి సంద‌ర్భంగా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో తార‌క‌ర‌త్న లుక్ సినిమాపై అంచ‌నాలు పెంచింది. కొద్ది సేప‌టి క్రితం చిత్ర పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ప్రముఖ నిర్మాత సి. క‌ళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. అతి త్వర‌లోనే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు.

Related posts