telugu navyamedia
news political Telangana trending

ఒడిశాలో … రైతుబంధు పథకం… ఇంకా…

rythu bandhu scheme in odisha state

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలుచేస్తున్న పథకాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే అనేక రాష్ట్రాలు ఇప్పటికే వాటిని ఆయా రాష్ట్రాలలో అమలు చేసేందుకు సుముఖత చూపుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో ఒడిశా కూడా చేరింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రైతుబంధు పథకాన్ని కర్షక్ అసిస్టెంట్ పేరిట అమలుచేసేందుకు సిద్ధం అయ్యారు.

రైతులుకు కర్షక్ అసిస్టెంట్ పథకం కింద ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు కొనుక్కునేందుకు ఒక్కొక్కరికి 10వేలు ఇవ్వనున్నారు. దీనికోసమే ప్రత్యేకంగా బడ్జెట్ లో 10,180 కోట్లు కేటాయిస్తున్నట్టు ఒడిశా సీఎం తెలిపారు. అంతే కాకుండా రైతులకు వడ్డీలేకుండా 50వేల వరకు రుణం కూడా ఇస్తామని తెలిపారు. ఇక వ్యవసాయభూమి లేనివారికి మేకలు, గొర్రెలు, పుట్టగొడుగుల సాగుకోసం ఒక్కొక్కరికి 12,500 రూపాయలు అందిస్తామని, తద్వారా వారికి కూడా ఉపాధి కల్పిస్తామని ఆయన అన్నారు.

కాగా, కేసీఆర్ కూడా ఫ్రంట్ ఏర్పాట్లపై మాట్లాడేందుకు రాష్ట్రాల పర్యటన రేపటి నుండి ప్రారంభిస్తున్నారు. ఇందులో ఏపీ, ఒడిశా.. తదితర రాష్ట్రాలలో ఆయన పర్యటించి, ఆయా రాష్ట్రాలలో ప్రధాన పార్టీల తో ఫ్రంట్ పై చర్చించనున్నారు. తెలంగాణాలో జరిగిన అభివృద్ధిని కూడా వారికి వివరించనున్నారు. దేశంలో బీజేపీ,కాంగ్రెస్ యేతర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం గురించి ఆయన వారితో చర్చిస్తారు. 

Related posts

మృతి చెందిన ఇంటర్ విద్యార్థులకు .. కోటి పరిహారం.. !

vimala p

రుణమాఫీని అమలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ: అరుణ్ జైట్లీ

vimala p

అరకులో కిడారి పేరుమీద.. ఆసుపత్రి, .. అమరావతిలో .. తిరుపతి.. 

ashok