telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలీవుడ్ లోకి… ఆర్.ఎక్స్ 100 .. హీరోగా సునీల్ శెట్టి వారసుడు..

sunil setty son with rx100 in bollywood

‘ఆర్ ఎక్స్ 100’ తెలుగులో క్రితం ఏడాది భారీ విజయాన్ని సాధించిన చిత్రాల జాబితాలో ఒకటి. అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ నటించిన ఈ సినిమా, యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. భారీవసూళ్లతో విజయవిహారం చేసింది. దాంతో ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సీనియర్ హీరో సునీల్ శెట్టి వారసుడు ‘అహన్ శెట్టి’ ఈ సినిమాతో బాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు.

ఈ సినిమా మిలన్ లుథ్రియా దర్శకత్వంలో రూపొందుతుంది. సాజిద్ నడియాడ్ వాలా ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చేనెలలో ఈ సినిమా షూటింగు మొదలు కానుంది. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ‘స్టీఫెన్ రిచ్చర్’ను ఈ సినిమా కోసం రంగంలోకి దింపారు. గతంలో ఈయన సల్మాన్ ‘కిక్’ సినిమాకి పనిచేసిన సంగతి తెలిసిందే.

Related posts