telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ప్రేమించిన వాడి కోసం రష్యా నుంచి ఇండియా వచ్చింది… కానీ…?

Girl

దీపక్ హరియాణాకు చెందిన వాడు. పంచ్‌కులా జిల్లా రత్తేవాలీ ప్రాంతంలో నివసిస్తుంటాడు. రష్యాకు చెందిన ఓ యువతితో దీపక్ కు ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడి, అది ప్రేమకు దారితీసింది. దీపక్ ను వివాహం చేసుకోవాలనుకున్న ఆ యువతీ తన కోరికను అతనికి చెప్పింది. తాను పెళ్లికి సిధ్దమేనని చెప్పాడు. ఇండియాకు వస్తే పెద్దల సమక్షంలో ఒక్కటవుదామని ఆమెను నమ్మించాడు. పాపం రష్యా యువతి మాత్రం దీపక్ మాటలను నిజమనే అనుకుంది. వెంటనే చేతిలో ఉన్న సొమ్మంతా తీసుకుని జూలై 18న ఇండియాలో ల్యాండయింది. ఎయిర్ పోర్టు కెళ్లిన దీపక్ ఆమెను ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నాడు. అనంతరం ఇద్దరూ కలసి కొన్ని రోజులు జాలీగా గడిపారు. జూలై 24న తల్లితండ్రులను పరిచయం చేస్తానంటూ దీపక్ ఆమెను ఒక ప్రాంతానికి తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె దగ్గరున్న డబ్బు, ఫోన్‌ను నొక్కేశాడు. ఇప్పుడే వస్తానంటూ ఆమెను నమ్మించి, నడిరోడ్డు మీద ఆమెను ఒంటరిగా ఒదిలేసి అక్కడి నుంచి ఉడాయించాడు. ఎంతసేపటికి అతడు రాకపోవడంతో తాను మోసపోయానన్న విషయం ఆమెకు అర్థమయింది. కానీ ఏం చెయ్యాలో తేలిక అక్కడే ఉండిపోయింది. అయితే ఆమెను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు విషయం తెలుసుకుని యువతిని రష్యన్ ఎంబసీ అధికారులకు అప్పగించారు. దీపక్‌ను ఆదివారం అరెస్టు చేశారు.

Related posts