telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ పై రష్యా సంచలన వ్యాఖ్యలు!

corona vacccine covid-19

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాకు వ్యాక్సిన్‌ కనుగొనేందుకు పలు దేశాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. చివరి దశ ప్రయోగాల్లో వికటించడంతో బ్రిటన్‌ ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ క్లినికల్స్ ట్రయల్స్ నిలిపివేశారు.

ఈ నేపథ్యంలో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ పై రష్యా సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యాక్సిన్‌ అభివృద్ధికి అవలంబిస్తున్న విధానంలో లోపాల్ని ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌ ప్రయోగాలు ఎత్తిచూపాయని రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌( ఆర్‌డీఐఎఫ్‌) సీఈవో కిరిల్‌ దిమిత్రియేవ్ చెప్పారు.‌

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్‌ కోసం కోతుల అడినోవైరస్‌ వెక్టార్‌ను వాడడంతో పాటు ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతికతను వినియోగించడం నూతన విధానాలని పేర్కొన్నారు. 

తాము తీసుకొస్తున్న స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌ మాత్రం అందుకు భిన్నమని ఆయన చెప్పుకొచ్చారు. ఇందులో మానవుల అడినోవైరస్‌ వెక్టార్‌ను వాడామని, ఇది చాలా సురక్షితమని తెలిపారు.తమ దేశం అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్లన్నీ అత్యంత సురక్షితమైనవని రుజువైందని ఆయన చెప్పుకొచ్చారు.

Related posts