telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

వ్యాక్సిన్ అందించాలని 20 దేశాలు కోరుతున్నాయి: రష్యా

Corona Virus Vaccine

కరోనా వైరస్‌కు తొలి వ్యాక్సిన్‌ తమదేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ పనితీరుపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తో పాటు, ఎన్నో దేశాల శాస్త్రవేత్తలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి.

 రష్యాపై నమ్మకంతో ఈ వ్యాక్సిన్ ను అందించాలని ఇండియా సహా 20 దేశాలు కోరాయి. ఈ విషయాన్ని రష్యా స్వయంగా ఓ ప్రకటనలో పేర్కొంది. ఇండియా, యూఏఈ, సౌదీ అరేబియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, బ్రెజిల్, మెక్సికో, టర్కీ, క్యూబా తదితర దేశాలు ‘స్పుత్నిక్ వీ’ వ్యాక్సిన్ ను కోరాయని ఓ ప్రకటనలో తెలిపింది.

ఆర్డీఐఎఎఫ్ (రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్) సహకారంతో ఈ వ్యాక్సిన్ తయారు కాగా, నేడు తొలిసారిగా 2 వేల మంది ప్రజలకు దీన్ని ఇవ్వనున్నారు.  ఈ ఏడాది చివరకు 20 కోట్ల డోస్ లను అందించాలని రష్యా లక్ష్యంగా పెట్టుకొంది. ఈ వ్యాక్సిన్ ఫార్ములాను అందిస్తే, తాము కూడా వ్యాక్సిన్  తయారు చేస్తామని పలు దేశాల ఫార్మా కంపెనీలు ముందుకు వస్తున్నాయని రష్యా పేర్కొంది.

Related posts